ఉత్తర భారతదేశానికి యధాతథంగా ఫ్లైదుబాయ్ విమానాలు
- July 12, 2023
యూఏఈ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలకు విమాన సర్వీసులను యధాతథంగా నడుపుతున్నట్లు ఫ్లైదుబాయ్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దాదాపు 1,300 రోడ్లు, 40 ప్రధాన వంతెనలు దెబ్బతిన్నాయని హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 31 మంది మరణించారని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







