వేసవిలో యూరప్‌కు వెళ్లే విమానాలపై సమ్మెల ప్రభావం?

- July 12, 2023 , by Maagulf
వేసవిలో యూరప్‌కు వెళ్లే విమానాలపై సమ్మెల ప్రభావం?

యూఏఈ: ఈ వేసవిలో యూరప్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్ట్రైక్స్ వల్ల ప్రస్తుతం ఎమిరేట్స్ , యూరోపియన్ నగరాల మధ్య విమానాలు ప్రభావితం కానందున యూఏఈ నివాసితులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చడం లేదు. అయితే, రాబోయే కాలంలో తమ యూకే విమాన షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని  విజ్ ఎయిర్ ప్రతినిధి వెల్లడించారు.

అబుధాబికి చెందిన ఎయిర్ క్యారియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "మేము గత సెప్టెంబరులో వేసవి సీజన్ కోసం షెడ్యూల్ సిద్ధం చేశాం. మా ఆపరేషన్‌లను పెంచేందుకు £90 మిలియన్లను పెట్టుబడి పెట్టాము. మేము షెడ్యూల్‌లను రూపొందించడానికి విమాన,  సిబ్బంది కోసం ఎక్కువ సమయం కేటాయించాము. మరింత పటిష్టంగా ఎదురయ్యే సవాళ్లని అంచనా వేయడానికి, తగ్గించడానికి కొత్త AI (కృత్రిమ మేధస్సు) విధానాలను అమలు చేస్తున్నాం." అని పేర్కొన్నారు.  

ప్రధాన యూఏఈ  విమానయాన సంస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయి కానీ యూరోపియన్ విమానాశ్రయాలలో పరిస్థితిని అవి నిశితంగా పరిశీలిస్తున్నాయి. దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్‌కు చెందిన ప్రతినిధి ఒకరు యూరప్‌కు వెళ్లే వారి విమానాలు ప్రస్తుతం ప్రభావితం కాలేదని, ఏదైనా మారితే వెంటనే ప్రకటిస్తామని తెలిపారు. జాతీయ క్యారియర్ ఎతిహాద్ ప్రతినిధి మాట్లాడుతూ.. "ప్రస్తుతం యూఏఈ -యూరప్ మధ్య మా విమానాలు సాధారణంగానే నడుస్తున్నాయి. ఎప్పటిలాగే, మేము మా విమానాలపై ప్రభావం చూపే ఏదైనా చర్య లేదా అంతరాయాన్ని పర్యవేక్షిస్తున్నాం." అని పేర్కొన్నారు.

మరోవైపు యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు కూడా తమ క్లయింట్లు తమ ప్రణాళికాబద్ధమైన వేసవి ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేయడం లేదని చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ రాజా మీర్ వాసిమ్ మాట్లాడుతూ.. "ఫ్లైట్‌లను రీషెడ్యూల్ చేయడం లేదా రీబుకింగ్ చేయాలని ఇప్పటివరకు ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. అయితే, గత నెల చివర్లో, కొంతమంది ప్రయాణీకులు హీత్రూ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌లో జాప్యం గురించి ఆరా తీశారు. కొందరు ప్రయాణించాల్సిన ప్రయాణికులు ఈ సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రయాణికులు స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్ లేదా మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ వంటి లండన్ చుట్టూ ఉన్న ఇతర విమానాశ్రయాలకు విమానాల గురించి అడిగారు. అనంతరం భద్రతా సిబ్బంది సమ్మెలను విరమించుకోవడంతో, అన్ని షెడ్యూల్ ప్రకారం సజావుగా సాగాయి. " అని పేర్కొన్నారు.    

ఏం జరుగుతోందంటే?
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సమ్మెలు అనేక యూరోపియన్ నగరాల్లో కనిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్ టెక్నీషియన్లు జూలై 18 నుండి నిరంతర సమ్మె ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  జీతాల వివాదంతో ఐబెరియా రీజినల్ ఎయిర్ నోస్ట్రమ్‌లో పైలట్లు జూన్ 6 నుండి రోజువారీ నిరవధిక సమ్మెను ప్రారంభించారు. సోమవారం, బ్రిటిష్ విమానయాన సంస్థ ఈజీజెట్ ప్రస్తుత వేసవి కాలంలో లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి, బయలుదేరే సుమారు 1,700 విమానాలను రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె కారణంగానే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. ఫ్రాన్స్‌లో ATC సమ్మెల కారణంగా దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదే విధంగా యూరప్‌లోని వివిధ విమానాశ్రయాలలో ఇతర సమస్యలు ఎయిర్ ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com