మహిళలు, చిన్నారులు సహా 24 మందిని కాపాడిన వ్యక్తికి సన్మానం
- July 13, 2023
దుబాయ్: అగ్నిప్రమాదం నుండి మహిళలు, పిల్లలతో సహా 24 మంది వ్యక్తుల ప్రాణాలను రక్షించిన దుబాయ్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌తో కలిసి పనిచేస్తున్న మొదటి కార్పోరల్ గదీర్ హమూద్ అల్ కాబీని ఘనంగా సన్మానించారు. అల్ కాబీ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడాన్ని గమనించి అలెర్ట్ అయ్యాడు. సమయాన్ని వృథా చేయకుండా.. ప్రధాన ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్లి మహిళలు, పిల్లలతో సహా అందరినీ బయటకు తీసుకొచ్చాడు. సివిల్ డిఫెన్స్ బృందాలు వచ్చే వరకు గాయపడిన వారిలో ఒకరికి ప్రథమ చికిత్స కూడా అందించాడు. అల్ కాబీని జెబెల్ అలీ పోలీస్ స్టేషన్ డైరెక్టర్, పోలీస్ స్టేషన్ల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మేజర్ జనరల్ డాక్టర్ అదెల్ అల్ సువైదీ సమక్షంలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ ఎక్స్పర్ట్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి సత్కరించారు. మంటలు, పొగతో చుట్టుముట్టబడిన ఇంట్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో వేగంగా స్పందించినందుకు అల్ కాబీకి అల్ మన్సూరి ఫస్ట్ కార్పోరల్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







