హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటన.. నలుగురు ఉగ్రవాదులకు పదేండ్ల జైలు శిక్ష
- July 13, 2023
న్యూఢిల్లీ: హైదరాబాద్ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒబేద్, రెహ్మాన్, ఇమ్రాన్ ఖాన్, ధనీష్ అన్సారీ, ఆప్తాబ్ ఆలం అనే నలుగురు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ చేసిన వాదనలతో ప్రత్యే కోర్టు ఏకీభవించింది. 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో జరిగిన పేలుళ్లు.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని నిర్ధారించింది. ఇవేకాకుండా వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలోనూ వీరి పాత్ర ఉందని గుర్తించింది. జూలై 7వ తేదీన ఈ నలుగురు నిందితులను దోషులుగా తీర్చిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. గురువారం నాడు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







