నాని కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్.!
- July 13, 2023
నాని 30 అంటూ ‘దసరా’ టైమ్‌లోనే నేచురల్ స్టార్ నాని తన 30 వ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు.
తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో ఈ సినిమా కథ నడుస్తుందని ఆ గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చాడు నాని. లేటెస్ట్‌గా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
దాంతో పాటు ఓ చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ఎమోషనల్ సాంగ్ రన్ అవుతుండగా.. ఓ చిన్నారితో ‘మా నాన్న..’ అని నాని క్యారెక్టర్ పరిచయం చేశారీ గ్లింప్స్‌లో. ఆ తర్వాత హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘హాయ్ నాన్న’ అంటూ నానికి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించింది. మృణాల్‌ని ‘మై బెస్ట్ ఫ్రెండ్ యశ్న’ అని ఆ చిన్నారి పరిచయం చేసింది. అంటే ఏంటీ.! ఏదో కొత్త కథనే ‘హాయ్ నాన్న’తో చెప్పబోతున్నారన్న మాట.
చూస్తుంటే, ‘హాయ్ నాన్న’ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ స్టోరీ అనిపిస్తోంది. శౌర్యువ్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. డిశంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







