మొన్న పూజా హెగ్ధే ఇప్పుడు రష్మిక.!
- July 13, 2023
నితిన్‌కి రష్మిక హ్యాండిచ్చేసిందట. ఏంటిదంతా.? అనుకుంటున్నారా.? నితిన్, రష్మిక జంటగా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. పూజా కార్యక్రమాలతో ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు.
కాగా, రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ తాజాగా ప్రచారం జోరందుకుంది. ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమా నుంచి పూజా హెగ్ధే కూడా ఇలాగే తప్పుకుంది. అందుకు పూజా చెప్పిన కారణం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వుండడం. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే.
సేమ్ రీజన్ ఇప్పుడు రష్మిక సన్నిహితుల నుంచి కూడా వినిపిస్తుండడం విశేషం. రష్మిక కూడా ప్రస్తుతం బాలీవుడ్‌లో తెగ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే నితిన్‌కి హ్యాండిచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది.
‘VNRTrio’ అంటూ ఈ కాంబోని సూపర్ హిట్ కాంబోగా పిలుస్తున్నారు. రష్మిక తొలి సినిమా ‘ఛలో’ని డైరెక్ట్ చేసింది వెంకీ కుడుముల. ఆ తర్వాత నితిన్‌తో ‘భీష్మ’ సినిమా తెరకెక్కించాడు. రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్‌తో ముచ్చటగా మూడో సినిమాలోనూ రష్మికనే ఎంచుకున్నాడు వెంకీ కుడుముల.
అయితే, రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న ప్రచారంలో నిజమెంతో కానీ, ఇలా హీరోయిన్లు సడెన్‌గా హీరోలకు హ్యాండిచ్చేయడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన అంశమే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







