భద్రతా చర్యలపై కువైట్ ఫైర్ ఫోర్స్ సమీక్ష

- July 14, 2023 , by Maagulf
భద్రతా చర్యలపై కువైట్ ఫైర్ ఫోర్స్ సమీక్ష

కువైట్: జ్లీబ్ అల్-షుయౌఖ్‌లో అగ్నిప్రమాదం తర్వాత కువైట్ ఫైర్ ఫోర్స్ తన ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా  భద్రతా నిబంధనలు, ఉల్లంఘనలపై సమీక్షించింది. KFF చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ రక్కన్ అల్-మెక్రాద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్లీబ్ అల్-షుయౌఖ్‌ వంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత పక్షాలన్నీ కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com