బాలలను ఉరేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
- June 23, 2015
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.రమదాన్ మాసం జరుగుతున్న నేపథ్యంలో ఉపవాసం ఉండకుండా పగటిపూట తిన్నారనే పాపానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇద్దరు బాలలను ఉరేసి చంపేశారు. ఈ దారుణ ఘటన హిస్పా రాజధానిలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉరితీసిన బాలలిద్దరూ 18 సంవత్సరాల లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు. రమదాన్ ఉపవాసం చేపట్టకుండా వీరిద్దరూ ఆహారం తింటూ దొరికిపోయారని, ఇద్దరు బాలల వయసూ 18 సంవత్సరాల్లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపారు. మత నిబంధనలు పాటించలేదంటూ.. వారి శరీరాలపై ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు బాలల దేహాలను అలానే ఉంచారని మానవ హక్కుల కార్యకర్త వెల్లడించారు. కాగా రమదాన్ మాసం గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రమదాన్ మాసంలో మహమ్మదీయులు పగలంతా కఠోరంగా ఉపవాస దీక్ష చేస్తారు. ఈ క్రమంలో ఆహారం తీసుకోకుండా.. నీటిని కూడా సేవించరు.ఇంకా స్మోకింగ్ వంటి ఇతరత్రా చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







