జూలై 15 నుండి యూరప్‌లో విమానాలు రద్దు, అంతరాయాలు..!
- July 15, 2023
యూఏఈ: యూరోపియన్ దేశాలలో విమానాశ్రయ సిబ్బంది వేతనాలు పెంచాలని సమ్మెలు చేస్తున్నారు. దీంతో జూలై 15 నుండి యూరప్ కు వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు, అంతరాయాలు కలిగే అవకాశం ఉందని ట్రావెల్ ఏజేన్సీలు చెబుతున్నాయి. యూరోపియన్ గగనతలం అంతటా ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న నెట్వర్క్ మేనేజర్ ఆపరేషన్స్ సెంటర్లో సమ్మె చేయనున్నట్టు యూరోకంట్రోల్ ట్రేడ్ యూనియన్లలో ఒకటి జులై 7న ప్రకటించింది.
బెల్జియం
అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల కోసం బెల్జియంలోని ర్యాన్ఎయిర్ పైలట్లు జూలై 15 నుండి 16 వరకు సమ్మె చేస్తారని వారి యూనియన్ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. సమ్మె చార్లెరోయ్ విమానాశ్రయం నుండి దాదాపు 140 విమానాలపై ప్రభావం చూపుతుంది.
బ్రిటన్
బ్రిటన్ నెం.2 విమానాశ్రయం గాట్విక్‌లో గ్రౌండ్ స్టాఫ్, బ్యాగేజ్ హ్యాండ్లర్లు మరియు చెక్-ఇన్ ఏజెంట్లతో సహా దాదాపు 950 మంది కార్మికులు జూలై 28 నుండి ఆగస్టు 1 వరకు, ఆగస్టు 4 నుండి 8 వరకు వేతన వివాదం కారణంగా సమ్మె చేయనున్నట్లు యునైట్ ట్రేడ్ యూనియన్ జూలై 14న ప్రకటించింది. బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో దాదాపు 100 మంది భద్రతా అధికారులు, టెర్మినల్ టెక్నీషియన్లు జూలై 18 నుండి నిరంతర సమ్మె చర్యను ప్రారంభించనున్నారు.
ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సమ్మెలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పెన్షన్ వయస్సును పెంచే ప్రణాళికకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఫ్రెంచ్ ATC సమ్మెల కారణంగా జూన్‌లో 900 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది.
ఇటలీ
కొత్త సామూహిక ఒప్పందం కోసం చర్చలకు సంబంధించి పలు యూనియన్లు జూలై 15న దేశవ్యాప్త విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, బ్యాగేజ్ హ్యాండ్లర్లు మరియు చెక్-ఇన్ సిబ్బందితో పాటు ఇటాలియన్ పైలట్ల వూలింగ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల మధ్య సమ్మె చేయనున్నారు. మాల్టా ఎయిర్ పైలట్లు, విమాన సహాయకులు మధ్యాహ్నం నుండి నాలుగు గంటల పాటు వారికి మద్దతుగా పాల్గొంటారు.
పోర్చుగల్
జూలై 21 నుండి 25 వరకు క్యాబిన్ సిబ్బంది సమ్మెకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఈజీజెట్ పోర్చుగల్‌కు వచ్చే లేదా బయలుదేరే 350 విమానాలను రద్దు చేసినట్లు పౌర విమానయాన విమాన సిబ్బంది SNPVAC యూనియన్ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి యూనియన్ చేపట్టనున్న మూడవ సమ్మె ఇది.
స్పెయిన్
ఫిబ్రవరి 27 నుండి ప్రతి సోమ, శుక్రవారాల్లో సమ్మె చేస్తున్న ఐబీరియా రీజినల్ ఎయిర్ నాస్ట్రమ్లోని పైలట్లు జీతాల వివాదం మధ్య జూన్ 6 నుండి రోజువారీ నిరవధిక సమ్మెకు దిగారు. రాబోయే రోజుల్లో కొన్ని విమాన మార్గాలు ప్రభావితం కావచ్చని ఐబీరియా పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







