2.7 మిలియన్ల ప్రయాణికులతో షార్జా టాక్సీ రికార్డు..!

- July 15, 2023 , by Maagulf
2.7 మిలియన్ల ప్రయాణికులతో షార్జా టాక్సీ రికార్డు..!

యూఏఈ: షార్జా టాక్సీ 2023 మొదటి అర్ధభాగంలో 2.7 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసి రికార్డులు సృష్టించింది. సగటున రోజుకు 15,000 మంది ప్రయాణికులు టాక్సీలలో ప్రయాణించారు. ముఖ్యంగా ఈద్ అల్-అధా సెలవుల సమయంలో  102,000 మంది ప్రయాణీకులు టాక్సీలను ఆశ్రయించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 20% అధికం కావడం గమనార్హం. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టాక్సీ వినియోగదారుల సంఖ్య కూడా ఈద్ సందర్భంగా రికార్డు స్థాయికి చేరుకుంది. మొత్తం 23,476 మంది ప్రయాణికులు షార్జా టాక్సీని విమానాశ్రయానికి వెళ్లడానికి , తిరిగి రావడానికి ఉపయోగించారని ఓసూల్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ యాక్టింగ్ జనరల్ మేనేజర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ట్యాక్సీ తన వాహనాల్లో 100% పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com