పౌరులను మోసం చేసిన 8 మంది అరెస్ట్
- July 15, 2023
దోహా: పౌరులను మోసం చేసినందుకు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సెర్చ్ అండ్ ఫాలో-అప్ విభాగం అరెస్టు చేసింది. అనుమానితులు చట్టానికి విరుద్ధంగా, డబ్బుకు బదులుగా షేర్లను వ్యాపారం చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఫాంటమ్ కంపెనీల నుండి ఆర్థిక లాభాల ఆశ చూపి పలువురిని మోసగించారు. నిందితుల వద్ద నుంచి అనేక నకిలీ కంపెనీల స్టాంపులు, వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అధికారిక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలను పూర్తి చేయడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







