షేక్ మహమ్మద్ 74వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా వేడుకలు
- July 15, 2023
యూఏఈ: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేడు 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన సాధించిన విజయాలు, దార్శనికతను గుర్తుచేసుకొని కొనియాడుతున్నారు. ఆయన దార్శనికత, వారసత్వం రాబోయే తరాలకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.
షేక్ మొహమ్మద్ "నంబర్ వన్" దూరదృష్టి గల నాయకత్వ నమూనాను స్థాపించారు. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య నుండి సాంకేతికత, పర్యాటకం వరకు ప్రఖ్యాతి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పని చేయడానికి, నివసించడానికి వీలుగా దుబాయ్ ని తీర్చిదిద్దాడు.
ఆయన పాలనలో మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, భూమిపై అత్యంత అందమైన భవనంగా గుర్తింపు సాధించింది. అదే విధంగా బుర్జ్ అల్ అరబ్, ప్రపంచంలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్, బుర్జ్ ఖలీఫా- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం, మహ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్- యూఏఈ మొదటి అంతరిక్ష సంస్థ, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్- ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఒకటి, DP వరల్డ్- ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటి,ఎక్స్‌పో 2020- 'భూమిపై గొప్ప ప్రదర్శన'గా గుర్తింపు పొందాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







