వ్యక్తిగత డేటా నిబంధనలపై అభిప్రాయాన్ని తెలపండి. SDAIA పిలుపు
- July 15, 2023
రియాద్: సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) జూలై నెలాఖరులోపు వ్యక్తిగత డేటా నిబంధనల డ్రాఫ్ట్‌లకు సంబంధించి తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని పబ్లిక్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల సభ్యులకు పిలుపునిచ్చింది. SDAIA ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ ఆఫ్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా (PDPL), రాజ్యం భౌగోళిక సరిహద్దుల వెలుపల వ్యక్తిగత డేటా బదిలీపై నియంత్రణపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. PDPL ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ చట్టానికి సంబంధించిన నిబంధనలు, విధానాలను స్పష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇది వ్యక్తులు వ్యక్తిగత డేటాకు సంబంధించిన వారి చట్టబద్ధమైన హక్కులు, బాధ్యతలను అర్థం చేసుకోవడానికి మరియు ఈ డేటా సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి వీలు కల్పిస్తుందన్నారు. సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాలను సాధించడంలో ప్రధాన స్తంభమైన డిజిటల్ పరివర్తన ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి చట్టం దోహదపడుతుందని, వ్యాపారాన్ని పెంచే విధంగా.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా వ్యక్తిగత డేటా నిబంధనల డ్రాఫ్ట్ ఉంటుందని సాదియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







