సమంత ఫ్యాన్స్ ‘ఖుషీ’ చేసుకునేదెప్పుడంటే.!
- July 15, 2023
‘ఖుషీ’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ‘ఖుషీ’ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
ప్యాన్ ఇండియా సినిమాగా ‘ఖుషీ’ని రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ, మలయాళ తదితర భాషల్లో ‘ఖుషీ’ రిలీజ్ కానుంది.
సమంత, విజయ్ దేవరకొండ జంటగా ‘ఖుషీ’ తెరకెక్కింది. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రూపు దిద్దుకుంది. ఇప్పటికే మ్యూజిక్‌తో ‘ఖుషీ’ టీమ్ మార్కులు కొట్టేసింది. రిలీజైన రెండు పాటలూ (‘నా రోజా నువ్వే.., ‘ఆరాధ్య..’) హృద్యంగా ఆకట్టుకుంటున్నాయ్.
ప్రచార చిత్రాలతో చాలా పాజిటివిటీ ఏర్పడింది ‘ఖుషీ’పై. ఇకపై అసలు సిసలు ప్రమోషన్లు షురూ చేయనున్నారట చిత్ర యూనిట్. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటు విజయ్ దేవరకొండకీ, అటు సమంతకీ ఇద్దరికీ అత్యంత ప్రతిష్టాత్మకం. చూడాలి మరి, ‘ఖుషీ’ సమంత ఫ్యాన్స్‌నీ, రౌడీ ఫ్యాన్స్‌నీ ఎలా ఖుషీ చేయనుందో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







