మానవ హక్కుల పరిరక్షణలో బహ్రెయిన్ పురోగతి
- July 16, 2023
బహ్రెయిన్: మానవ హక్కుల పరిరక్షణలో బహ్రెయిన్ గొప్ప పురోగతి నమోదు చేసింది. తాజాగా మానవ హక్కుల ప్రాధాన్య దేశాల జాబితా నుండి బహ్రెయిన్ పేరును తొలగించారు. ఈ మేరకు యూకే ఫారిన్, కామన్వెల్త్ & డెవలప్‌మెంట్ ఆఫీస్ (FCDO) జారీ చేసిన నివేదికను ప్రమాణికంగా తీసుకున్నట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (NIHR) ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాల్లో బహ్రెయిన్ సాధించిన ప్రగతిశీల సంస్కరణల్లో బహ్రెయిన్ ప్రశంసనీయమైన పురోగతిని సాధించిందని తెలిపింది. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడికలు, చట్టాలను సమర్థించడంలో బహ్రెయిన్ తిరుగులేని నిబద్ధత ఈ విజయానికి కారణమని NIHR పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంతో, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వం మానవ హక్కుల పరిరక్షణకు తీసుకున్న చర్యలు ప్రసంశనీయమన్నారు. షూరా, రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్‌ల ద్వారా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో బహ్రెయిన్ పౌరుల క్రియాశీల భాగస్వామ్యాన్ని, అలాగే జాతీయ పురోగతిలో మహిళల గణనీయమైన ప్రమేయాన్ని FCDO నివేదిక ప్రశంసించింది. ప్రజల మధ్య సహనం, శాంతి, ప్రేమ మరియు సామరస్యపూర్వక సహజీవన సూత్రాలను ప్రోత్సహించడంలో బహ్రెయిన్ ప్రపంచ మానవతావాద ప్రయత్నాలు అభినందనీయమని NIHR ఛైర్మన్ అలీ అహ్మద్ అల్ డెరాజీ అన్నారు. ఈ అద్భుతమైన విజయానికి హిస్ మెజెస్టి కింగ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బహ్రెయిన్ లో మానవ హక్కులను పెంపొందించడంలో NIHR కౌన్సిల్ ఆఫ్ కమీషనర్ల పాత్రను గుర్తించినందుకు ఆయన రాయల్ హైనెస్ ది క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్‌లకు కూడా అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







