ఎలివేటర్‌లో దుబాయ్ పాలకుడు. సంతోషంలో భారతీయ కుటుంబం
- July 16, 2023
యూఏఈ: భారతీయ పారిశ్రామికవేత్త అనస్ రెహమాన్ జునైద్ కుటుంబానికి జీవత కాలం పాటు గుర్తుండే ఓ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. తాము వెళుతున్న ఎలివేటర్ లో దుబాయ్ పాలకుడు రావడంతో అతని కుటుంబం జీవితకాల ఆశ్చర్యాన్ని పొందారు. శనివారం అట్లాంటిస్ ది రాయల్‌లోని 22వ అంతస్తు నుండి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఎలివేటర్‌లో వెళుతుండగా.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా అదే లిఫ్ట్ ఎక్కడంతో వారు ఆశ్చర్యంతో కూడిన సంతోషానికి గురయ్యారు. "అతను లిఫ్ట్‌లోకి అడుగుపెట్టాడు. చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు. అతను నా కుమార్తె చుట్టూ చేతులు వేసి, అతను ఎవరో తెలుసా అని అడిగాడు. దుబాయ్ పాలకుడు తమ కుటుంబంతో మాట్లాడారు. బయలుదేరే ముందు ఫోటో దిగేందుకు అవకాశం ఇచ్చి తమ కుటుంబ సభ్యులను సంతోషపరిచాడు.’’ అని జునైద్ పేర్కొన్నారు. దుబాయ్ పాలకుడిని ఇలా కలుసుకోవడం తన 10 ఏళ్ల కుమార్తె మిషెల్, 7 ఏళ్ల కుమారుడు డానియాల్, తన భార్య తంజీమ్ చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మేము అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందు మా పాఠశాల స్నేహితులు, బంధువులకు పంపినట్లు అనస్ చెప్పారు. అయితే, దుబాయ్ రూలర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడమే తమకు అతిపెద్ద పశ్చాత్తాపమని అనస్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







