ఇకపై ఏటా బహ్రెయిన్ ఆల్మండ్ ఫెస్టివల్..!
- July 17, 2023
బహ్రెయిన్: అత్యంత విజయవంతమైన ఆల్మండ్ ఫెస్టివల్‌ను బహ్రెయిన్‌కు ఏటా సంప్రదాయంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. బహ్రెయిన్ వ్యవసాయం, సముద్ర వనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అహ్మద్ హసన్ ప్రకారం.. భవిష్యత్తులో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన పండ్లను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఒక సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేస్తోంది. నిన్న రెండవ, చివరి వారంలోకి ప్రవేశించిన మొదటి ఆల్మండ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమాలు జరిగాయి. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు నివాసితులతోపాటు GCC జాతీయులు రైతులతో కలిసి తరలివచ్చారు.
ఇదిలా ఉండగా.. బహ్రెయిన్‌లోని వార్షిక ఈవెంట్ల జాబితాకు ఆల్మండ్ ఫెస్టివల్ ను చేర్చడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతను డాక్టర్ ఖలేద్ వ్యక్తం చేశారు. ఈ ఫెస్టివల్లో 18 పొలాలు, 3 ప్రాజెక్టులు, ఉత్పాదక కుటుంబాలు మరియు ఆల్మండ్ ఆధారిత ఉత్పత్తులలో ప్రత్యేకత కలిగిన 11 రెస్టారెంట్లు పాల్గొన్నాయి. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మహమ్మద్ అల్-అరైబీ బహ్రెయిన్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల రంగంలో బహ్రెయిన్ పౌరుల సామర్థ్యాన్ని ముగింపు వేడుకలో హైలెట్ చేశారు. ఆల్మండ్ ఫెస్టివల్ గత వారం బుదయ్య బొటానికల్ గార్డెన్‌లోని బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్ సైట్లో ప్రారంభమైంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







