2024లో 9 రోజుల వీకెండ్. 2023లో మరో 2 లాంగ్ వీకెండ్లు
- July 17, 2023
యూఏఈ: యూఏఈలో ఉండే నివాసితులు చాలా మంది వార్షిక సెలవులను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. చాలా మంది తమ సెలవులను ఒక సంవత్సరం ముందుగానే ప్లాన్ చేస్తారు. ప్రత్యేకించి యూరప్‌లోని పలు టూరిస్టు ప్రాంతాలకు వెళ్లేందుకు యూఏఈ వాసులు ఆసక్తి చూపుతుంటారు. అదే సమయంలో వ్యక్తిగత కార్యక్రమాలు లేదా వేసవి సెలవుల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, నివాసితులు తరచుగా ప్రభుత్వ సెలవులు, సుదీర్ఘ వారాంతాలను(లాంగ్ వీకెండ్) పరిగణనలోకి తీసుకుంటారు.
ఇక విషయానికొస్తే.. 2023లో ఇంకా రెండు లాంగ్ వీకెండ్ లు రానున్నాయి. కొత్త హిజ్రీ సంవత్సరంలో జూలై 21 (శుక్రవారం)నుండి జూలై 23 (ఆదివారం)వరకు మూడు రోజుల వరకు ఫస్ట్ వీకెండ్.. సెప్టెంబర్ 29(శుక్రవారం) నుండి అక్టోబర్ 1(ఆదివారం) వరకు సెకండ్ సుదీర్ఘ విరామం రానున్నది. యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం చివరి సెలవుదినం డిసెంబర్ 2, 3 (శనివారం, ఆదివారం) తేదీలలో ఉంటుంది.
2024లో 9 రోజుల సెలవు
వచ్చే ఏడాది ఈద్ అల్ ఫితర్ సందర్భంగా 2024 ప్రథమార్థంలో 9 రోజుల వెరీ లాంగ్ వీకెండ్ వచ్చే అవకాశం ఉంది. ఖగోళ శాస్త్ర గణనల ఆధారంగా.. పవిత్ర రంజాన్ మాసం మార్చి 11(సోమవారం), 2024న ప్రారంభమవుతుందని, ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 10న(బుధవారం) వస్తుందని అంచనా. యూఏఈ ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులు ఇవ్వబడతాయి. ఉద్యోగులు ఏప్రిల్ 8 (సోమవారం)నుండి ఏప్రిల్ 12(శుక్రవారం) వరకు సెలవులను పొందే అవకాశం ఉంది. దీనికి తోడు మరో రెండు రోజులు సెలవులను తీసుకున్నట్టయితే.. ఉద్యోగులు ఏప్రిల్ 6 (శనివారం) నుండి ఏప్రిల్ 14 (ఆదివారం) వరకు తొమ్మిది రోజులపాటు సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.
2024లో ఈద్ అల్ అదా జూన్ 17 సోమవారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సెంటర్ అంచనా వేసింది. ఈద్ అల్ అదా ప్రకటించిన తేదీకి వస్తే, యూఏఈలోని ఉద్యోగులకు జూన్ 15, శనివారం నుండి జూన్ 19 బుధవారం వరకు ఐదు రోజులపాటు సెలవులు లభిస్తాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







