జెడ్డాలో చర్చలు జరిపిన క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- July 17, 2023
జెడ్డా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆదివారం విసృత చర్చలు జరిపారు. జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో ప్రిన్స్ మహ్మద్ కిషిదాకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. జపాన్ ప్రధాని రాక సందర్భంగా అధికారిక రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సౌదీ-జపనీస్ విజన్ 2030కి అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై వారు చర్చలు జరిపారు. వారు అనేక ప్రాంతీయ - అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని జపాన్ కంపెనీల అధిపతులు, వ్యాపార యజమానుల బృందంతో క్రౌన్ ప్రిన్స్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







