కువైట్ లో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగుల తొలగింపు
- July 17, 2023
కువైట్: 2023 సంవత్సరం ప్రథమార్థంలో బహిష్కరణకు గురైన.. ఉద్యోగాల నుండి తొలగించబడిన ప్రవాసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో 10,000 మందికి పైగా ప్రవాస ఉద్యోగులను తొలగించారు. అదే సమయంలో బహిష్కరణ గణాంకాలు కూడా పెరుగుతున్నాయి. కాగా, ఈ నెలలో బహిష్కరణకు గురైన 1,000 కంటే ఎక్కువ మంది ప్రవాసులు బహిష్కరణ కేంద్రంలో ఉన్నారు. క్రిమినల్ లేదా దుష్ప్రవర్తన కేసులు, అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణ లేదా కువైట్ నుండి వారిని బహిష్కరించాలని న్యాయపరమైన తీర్పుల కారణంగా పలువురిని బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఈజిప్షియన్లు, బంగ్లాదేశీయులు ఉన్నారని నివేదిక పేర్కొంది. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన 7,000 మందితో సహా గత సంవత్సరం దాదాపు 250,000 మంది శాశ్వతంగా కువైట్‌ను విడిచిపెట్టినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







