మొత్తానికి ‘బేబీ’కి వర్కవుట్ అయ్యింది.!
- July 18, 2023
‘బేబీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.
యూట్యూబర్ వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా డెబ్యూ చేయగా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. కాగా, ప్రమోషన్లు ఓ సినిమాని హిట్ లిస్టులో ఎలా నిలబెడతాయో ఈ సినిమాని చూసి అర్ధం చేసుకోవచ్చు.
హార్ట్‌ఫుల్‌గా ప్రమోషన్లు చేశారు. అక్కడే సగం మార్కులు కొట్టేశారు చిత్ర యూనిట్. రివ్యూలు ఎలా వచ్చినా, ప్రమోషన్స్ కారణం కావచ్చు.. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వచ్చాయ్.
వీకెండ్ కలెక్షన్లు కూడా బాగున్నాయ్. ఓ చిన్న సినిమాకి ఇంతకన్నా కావల్సిందేముంటుంది. ‘బేబీ’గా వైష్ణవీ చైతన్యకీ మంచి డెబ్యూ మూవీ అనే చెప్పుకొచ్చు.
తొలి సినిమాకే యాక్టింగ్ పరంగా తానేంటో ప్రూవ్ చేసుకుంది కాబట్టి, వైష్ణవికి ఈ సినిమా కలిసొచ్చే అంశమే. మరో రెండు మూడు ఇలాంటి సినిమాలే పడితే, వైష్ణవి టాలీవుడ్‌లో స్టార్‌డమ్ దక్కించుకునే అవకాశాల్లేకపోల్లేదన్న అభిప్రాయాలొస్తున్నాయ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







