వెదురు దవ్వ.! దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?

- July 18, 2023 , by Maagulf
వెదురు దవ్వ.! దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?

వెదురు దవ్వ అదేనండీ.. వెదురు చెట్టు మొదట్లో వుండే భాగాన్ని వెదురు దవ్వ అంటారు. దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. ఫైబర్, ప్రొటీన్స్, కార్భోహైడ్రేట్స్.. పుష్కలంగా లభించే ఈ భాగాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.

వర్షాకాలంలో ఈ భాగం మార్కెట్లోనూ విరివిగా లభిస్తోంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల్ని దూరంగా వుంచడంలో ఈ వెదురు దవ్వ కీలక పాత్ర వహిస్తోంది. సంవత్సరం పాటు నిల్వ వుండే దీన్ని ఆయుర్వేద మెడిసెన్స్‌తో పాటూ, ఇంగ్లీష్ మెడిసన్స్‌లోనూ ఉపయోగిస్తున్నారు.

సీజనల్‌గా వచ్చే అనేక రకాల వైరస్, బ్యాక్టీరియా వ్యాధుల నుంచి కాపాడడంలో ఇది మంచి ఉపయోగకారిగా పని చేస్తుంది. మధు మేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకుంటే జీవిత కాలం మధుమేహం నియంత్రణలో వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 

శీతాకాలం, వర్షాకాలం శరీరాన్ని వెచ్చగా వుంచేందుకు ఎండాకాలంతో చల్లగా వుంచేందుకు ఇది తోడ్పడుతుందట. అలాగే, పచ్చళ్ల తయారీలోనూ సాంబారు వంటి రకరకాల కూరల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఉప్పు నీళ్లలో వేస్తే దాదాపు ఆరు నెలలపాటు ఈ ఐటెమ్ నిల్వ వుంటుందట. అయితే, గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com