బాలలను ఉరేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

- June 23, 2015 , by Maagulf
బాలలను ఉరేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.రమదాన్ మాసం జరుగుతున్న నేపథ్యంలో ఉపవాసం ఉండకుండా పగటిపూట తిన్నారనే పాపానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇద్దరు బాలలను ఉరేసి చంపేశారు. ఈ దారుణ ఘటన హిస్పా రాజధానిలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉరితీసిన బాలలిద్దరూ 18 సంవత్సరాల లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు. రమదాన్ ఉపవాసం చేపట్టకుండా వీరిద్దరూ ఆహారం తింటూ దొరికిపోయారని, ఇద్దరు బాలల వయసూ 18 సంవత్సరాల్లోపేనని సిరియా మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపారు. మత నిబంధనలు పాటించలేదంటూ.. వారి శరీరాలపై ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు బాలల దేహాలను అలానే ఉంచారని మానవ హక్కుల కార్యకర్త వెల్లడించారు. కాగా రమదాన్ మాసం గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రమదాన్ మాసంలో మహమ్మదీయులు పగలంతా కఠోరంగా ఉపవాస దీక్ష చేస్తారు. ఈ క్రమంలో ఆహారం తీసుకోకుండా.. నీటిని కూడా సేవించరు.ఇంకా స్మోకింగ్ వంటి ఇతరత్రా చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com