రోజంతా హాయిగా, చురుకు వుండడం కోసం ఇలా చేద్దాం..

- May 15, 2016 , by Maagulf
రోజంతా  హాయిగా, చురుకు వుండడం కోసం ఇలా చేద్దాం..

ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో ఒత్తిడులు మనుషులపై ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి సందర్భంలో పొద్దున్నే లేవాలంటే కొంత కష్టంగానే అనిపిస్తుంది. పని చేయాలంటే ఇబ్బందిగా, బద్ధకంగా అనిపిస్తుంది. మళ్లీ నిద్రపోవాలనిపిస్తుంది. అతి కష్టంగా లేచినా బద్ధకం మాత్రం వదలదు. ఆ బద్ధకాన్ని వదిలించుకుని చురుగ్గా మారాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
- నిద్ర లేవగానే వెంటనే పనుల్లో పడకుండా, ఐదు నిమిషాల పాటు మౌనంగా కళ్లు మూసుకుని కూర్చోవాలి. ఆ రోజులో మీరు చేయాలనుకుంటున్న ఒక మంచి పని గురించి ఆలోచించాలి. దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎలాగైనా ఆ పనిని పూర్తి చేయాలనే దృఢసంకల్పం వల్ల ఉత్సాహం వస్తుంది.
- పొద్దున్నే తీసుకునే టిఫిన్ పోషకాలు మిళితమై ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసకృత్తులూ, సంక్లిష్ట పిండిపదార్థాలూ అందేలా పాలూ, గుడ్లూ, చపాతీలూ, గోధుమ రవ్వ ఉప్మా వంటివి తీసుకోవాలి.
- రోజులో కాసేపయినా ఎక్సర్‌సైజ్ చేయడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. ప్రశాంత వాతావరణంలో వ్యాయామం చేస్తే మంచిది. దీనివల్ల శరీరానికి స్వచ్ఛమైన గాలి అందుతుంది. శరీరానికి చురుకుదనం కూడా వస్తుంది.
- పొద్దున్నే హాయిగా నవ్వుకోవడం వల్ల మనసుకెంతో హాయిగా ఉంటుంది. బద్ధంగా అనిపించినప్పుడు ఒక పిప్పర్‌మెంట్‌ని నోట్లో వేసుకున్నా ఫలితం ఉంటుంది.
- సూర్యుడు వెలుగు వచ్చేంత వరకు పడుకోకుండా పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం, చురుకుదనం ఉంటుంది. దీనివల్ల మనం చేసే పనిలో నిర్లక్షం, అలసత్వం ఉండదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com