క్యారెట్ కుక్కీస్
- May 15, 2016
కావలసిన పదార్థాలు: క్యారెట్, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు చొప్పున, గుడ్డు - 1, బాదం పొడి - అర కప్పు, కిస్‌మిస్, వాల్‌నట్స్ తరుగు, తేనె, నూనె - పావు కప్పు చొప్పున, బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూను, వెనిలా ఎసెన్స్ - 1 టీ స్పూను, ఉప్పు - చిటికెడు, జాజికాయ, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒవెన్ 350 (ఫా.) డిగ్రీలో ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో గుడ్డు గిలకొట్టి అందులో క్యారెట్, కొబ్బరి తురుము, బాదంపొడి, కిస్‌మిస్, వాల్‌నట్స్, తేనె, నూనె, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, ఉప్పు, జాజికాయ, దాల్చినచెక్క పొడులు వేసి బాగా కలిపి ముద్దలా చెయ్యాలి. దీన్ని 18 భాగాలుగా చేసి చేత్తో దళసరి వడల్లా వత్తి ఒవెన్‌లో 15 నుండి 17 నిమిషాల పాటు ఉంచాలి. పిల్లలు బాగా ఇష్టపడే ఈ కుక్కీస్ మంచి బలమైన ఆహారం కూడా.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం