ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల...
- July 19, 2023
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నిని నిర్వహించనున్నారు. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్ 4 మ్యాచ్‌లు, శ్రీలంక 9 మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వనుంది.
ఆగస్టు 30న మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ కు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్‌కు లంకలోని క్యాండీ వేదిక కానుంది.
మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
సూపర్ -4 దశలో గ్రూప్ ఏలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు గ్రూప్-బిలో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబర్ 6న మొదటి మ్యాచ్ ఆడనుంది. సూపర్-4 దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 15న జరగనుంది.
ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్
ఆగస్టు 30 – పాకిస్థాన్ vs నేపాల్ – వేదిక ముల్తాన్
ఆగస్టు 31 – బంగ్లాదేశ్ vs శ్రీలంక – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక లాహోర్
సెప్టెంబర్ 4 – భారతదేశం vs నేపాల్ – వేదిక క్యాండీ
సెప్టెంబర్ 5 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – వేదిక లాహోర్
సెప్టెంబర్ 6 – సూపర్ 4s – A1 vs B2 – వేదిక లాహోర్
సెప్టెంబర్ 9 – B1 vs B2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 10 – A1 vs A2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 12 – A2 vs B1 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 14 – A1 vs B1 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 15 – A2 vs B2 – వేదిక కొలంబో
సెప్టెంబర్ 17 – ఫైనల్ – వేదిక కొలంబో
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి