డ్యూటీ ఫ్రీ డ్రా. 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుడు

- July 20, 2023 , by Maagulf
డ్యూటీ ఫ్రీ డ్రా. 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుడు

దుబాయ్: తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని కాన్‌కోర్స్ ఎలో డ్రా జరిగింది. భారతీయుడు  1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ముంబైలో ఉండే భారతీయ జాతీయుడైన వినయ్ శ్రీకర్ చోడంకర్, మిలీనియం మిలియనీర్ సిరీస్ 429లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతను టిక్కెట్ నంబర్ 3588తో జూన్ 30న దుబాయ్ నుండి సౌదీ అరేబియాలోని టబుక్‌కి వెళ్లేటప్పుడు కొనుగోలు చేశాడు.  అయితే 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుండి $1 మిలియన్‌ను గెలుచుకున్న 212వ భారతీయ జాతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు.  బుధవారం నాటి డ్రాలను దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ & సీఈఓ కాల్మ్ మెక్‌లౌగ్లిన్, రమేష్ సిడాంబి( COO), సలాహ్ తహ్లాక్( జాయింట్ COO) పాల్గొన్నారు. 0405 టిక్కెట్ నంబర్‌తో మిలీనియం మిలియనీర్ సిరీస్ 428లో $1 మిలియన్ విజేత మణి బాలరాజ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ అధికారుల నుండి తన ఉత్సవ చెక్కును అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com