పోలీసుల అదుపులోకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- July 20, 2023
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు దారి మధ్యలోనే అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు. తమ వాహనాలను అడ్డుగా పెట్టిన కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను మధ్యలోనే అడ్డగించిన రాచకొండ సీపీ నేతృత్వంలోని పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకోవడంపై కిషన్ రెడ్డి పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రిని అయిన తనను ఎలా అడ్డుకుంటారని సీపీ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగారు. రఘునందన్, ఇతర నేతలతో కలిసి వర్షంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా తనకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. బాటసింగారం వెళ్లి తీరుతానని చెప్పారు. వినిపించుకోని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







