ఆటమ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫింగ్‌తో 30 శాతం ఎక్కువ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి

- July 20, 2023 , by Maagulf
ఆటమ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫింగ్‌తో 30 శాతం ఎక్కువ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి

హైదరాబాద్: ప్రపంచంలోనే మొట్టమొదటి, భారత-నిర్మిత ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫింగ్ సిస్టమ్ ఆటమ్ (ATUM)తో 30% అధికంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతోంది. సాంప్రదాయ పైకప్పుల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ఆటమ్ యొక్క వినూత్న ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫింగ్ సిస్టమ్ మిళితం చేస్తుంది. ఫైబర్ సిమెంట్ బోర్డ్ బేస్, మెరుగైన ఇన్సులేషన్ లక్షణాలతో, ఆటమ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్‌లు పైకప్పు మీద సౌరశక్తిని గరిష్టంగా వినియోగించుకోవడమే కాకుండా భవనాల సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

ర్యాకింగ్ సిస్టమ్‌లు, ట్రస్సులపై ప్రత్యేక ఇన్‌స్టాలేషన్ అవసరమయ్యే సంప్రదాయ సోలార్ ప్యానెల్‌ల మాదిరిగా కాకుండా, ఆటమ్ సోలార్ ప్యానెల్‌లను పైకప్పులోనే అమర్చవచ్చు. ఆటమ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్‌లలోని ఫైబర్ సిమెంట్ బోర్డ్ బేస్‌ సాంప్రదాయ సోలార్ పైకప్పులతో పోలిస్తే అత్యుత్తమ ఇన్సులేషన్‌ను అందిస్తుంది. దీని వల్ల భవనాల ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఇది ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని, విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.  పైకప్పు, సోలార్ ప్యానెల్ రెండింటిగా పని చేస్తూ, ఆటమ్ కార్యాచరణపై రాజీ పడకుండా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది. ఆటమ్ ఫైబర్ సిమెంట్ బోర్డ్ బేస్ ఉష్ణ బదిలీని తగ్గించి, వాలుగా ఉన్న సాంప్రదాయ కాంక్రీట్ పైకప్పు లేదా పారిశ్రామిక గాల్వాల్యూమ్ రూఫింగ్‌తో పోలిస్తే విద్యుత్ వినియోగాన్ని 6% తగ్గిస్తుంది. ఆటమ్ సోలార్ ప్యానెల్‌లలో మైక్రో క్రాక్‌లు ఉండవు, అవి 250 kmph వరకు గాలి వేగాన్ని తట్టుకుంటాయి. 

ఆటమ్ సోలార్ ప్యానెల్‌లు IEC స్టాండర్డ్‌కు అనుగుణమైనవి. ఇవి అన్ని రకాల సోలార్ ఇన్‌స్టాలేషన్‌లను అనుమతిస్తాయి. ఆటమ్ భారత ప్రభుత్వ పేటెంట్ సర్టిఫికేట్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దక్షిణాఫ్రికా నుండి పేటెంట్లను కూడా కలిగి ఉంది.

విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వంశీ కృష్ణ గడ్డం మాట్లాడుతూ, "ఆటమ్‌తో సౌర విద్యుత్ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చాలనేది మా లక్ష్యం. మా ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫింగ్ సిస్టమ్ అదనపు నిర్మాణాల అవసరాన్ని తొలగిస్తుంది, అదే సమయంలో చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మిగతా సోలార్ ప్యానెల్స్ తో పోలిస్తే, ఒకే ఏరియాలో అది మరింత విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఆటమ్ స్వచ్ఛమైన, పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తూ, సమగ్ర సుస్థిర విధానాలను ప్రోత్సహిస్తుంది,’’ అన్నారు.

ఆటమ్ భారతదేశ ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు దోహదపడటమే కాకుండా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, సుస్థిరమైన విద్యుదుత్పత్తి పరిష్కారాల కోసం ప్రపంచ ప్రయత్నాలకు ప్రేరణగా కూడా పనిచేస్తుంది.

సుస్థిరత్వం విషయంలో ఆటమ్ నిబద్ధత దాని ఉత్పత్తులకు మాత్రమే పరిమితం కాదు. ఆటమ్ సోలార్ తయారీ ప్రక్రియలు పర్యావరణ అనుకూల పద్ధతులకు లోబడి ఉంటాయి. దాని కార్యకలాపాలు పర్యావరణంపై అతి తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అత్యాధునిక సాంకేతికత, సామగ్రిని ఉపయోగించడం ద్వారా, ఆటమ్ సౌర పరిశ్రమలో సుస్థిరత్వం కోసం నూతన ప్రమాణాలను నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com