10 కిలోల టొమాటోలతో ఇండియాకు వచ్చిన దుబాయ్ ప్రవాసి..!
- July 21, 2023
యూఏఈ: ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో టమోటాల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో నివసిస్తున్న తన కుమార్తెకు ఒక తల్లి వచ్చే సమయంలో 10 కిలోల టమోటాలు తీసుకురావాలని కోరింది. దుబాయ్ నివాసి వేసవి సెలవుల కోసం భారతదేశానికి వెళ్లేసమయంలో టమోటాలను తీసుకెళ్లింది. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మా సోదరి వేసవి సెలవుల కోసం దుబాయ్ నుండి ఇండియాకు వస్తోంది. దుబాయ్ నుండి ఏదైనా కావాలా అని మా అమ్మను అడగగా.. మా అమ్మ 10 కిలోల టమోటాలు తీసుకురా అని చెప్పింది. 10 కేజీల టొమాటోలను సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి తీసుకొచ్చింది” అని ట్విట్టర్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కి ప్రస్తుతం 52,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నెజిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా..ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో టమోటాలు కిలో ధర రూ.300 (సుమారు 15 దిర్హామ్‌లు)కి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







