ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’తో ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయినట్టేనా.?
- July 21, 2023
ప్రభాస్ కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. స్టార్‌డమ్ ఊహించని విధంగా వచ్చేసినప్పటికీ, సక్సెస్ మాత్రం దూరమైపోతోంది. దానికి తోడు అనవసరమైన ట్రోలింగ్స్‌తో సతమతమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజా సినిమా ‘ప్రాజెక్ట్ కె’ నుంచి టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘కల్కి 2898ఎడీ’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. ఇక, గ్లింప్స్ విషయానికి వస్తే, హాలీవుడ్ రేంజ్‌లో వుంది.
హైలీ టెక్నికల్‌గా విజువల్ వండర్‌లా ఈ గ్లింప్స్ కట్ చేశారు. మొన్న రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ విషయంలో కొన్ని కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గ్లింప్స్ వచ్చాక ఆ కామెంట్లకు చెక్ పడినట్లయ్యింది.
ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ గ్లింప్స్ విషయంలో. హీరోయిన్ దీపికా పదుకొనె, కీలక పాత్రధారి అయిన అమితాబ్ బచ్చన్‌లను ఈ గ్లింప్స్‌లో చూపించారు. అలాగే, ఈ సినిమాకి ప్రతినాయకుడి పాత్ర కోసం విశ్వనటుడు కమల్ హాసన్‌ని ఎంచుకుని సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయారనే చెప్పాలి. చూడాలి మరి, ప్రభాస్ ఇమేజ్‌ని ఈ సినిమా అయినా ఆదుకుంటుందో లేదో.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







