డబుల్ ఇస్మార్ట్ కోసం పూరీ పెద్ద స్కేచ్చే వేస్తున్నాడుగా.!
- July 21, 2023
పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పూరీ నుంచి వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్‌గా మిగలడంతో, పూరీ జగన్నాధ్‌కి తదుపరి సినిమా ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది.
దాంతో, ‘డబుల్ ఇస్మార్ట్’ని లైన్లో పెట్టాడు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అవ్వడం, రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో పూరీ నెక్స్ట్ లెవల్ థింకింగ్ చేస్తున్నాడట.
సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో రూపొందించాలనుకుంటున్నాడట. అందుకోసం హీరోయిన్లను బాలీవుడ్ నుంచి ఎత్తుకు రావాలనుకుంటున్నాడనీ తెలుస్తోంది.
ఆ లిస్టులో ఆల్రెడీ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయ్. శ్రద్ధా కపూర్, అలియా భట్ తదితర ముద్దుగుమ్మలను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సుకత చూపించేవారు కాదు. కానీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ భామలు ఎగిరి గంతేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం పూరీ సినిమాల్లో నటించడం అంటే, కాస్త రిస్క్‌తో కూడిన విషయమే. కానీ, ఈ సినిమా కోసం హీరోయిన్లకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నాడట పూరీ. పూరీ కనెక్ట్స్ బ్యానర్లో ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







