‘బ్రో’ ప్రమోషన్స్‌లో మార్క్ బిజీ బిజీ.! పవన్ జాయిన్ అయ్యేదెప్పుడంటే.!
- July 21, 2023
సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘బ్రో’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేశారు. ప్రచార చిత్రాలతో ఓ వైపు అంచనాలు పెంచేస్తుండగా, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ డైరెక్ట్ ప్రమోషన్లలోకి దిగారు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
ఇంటర్వ్యూలతో పాటూ, టూర్లతోనూ సాయి ధరమ్ తేజ్ బిజీగా వున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో తేజు సందడి చేస్తున్నాడు. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ప్రమోషన్లలో కనిపిస్తాడా.? అని సినీ జనం ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యవహారాల్లో బిజీగా వున్నారు. ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ హాజరయ్యేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా వుంటే, రేపో ఎల్లుండో ట్రైలర్ రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
సుమద్ర ఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారమందించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







