బీపీ, షుగర్‌ని వాకింగ్‌తో కంట్రోల్ చేయొచ్చా.?

- July 21, 2023 , by Maagulf
బీపీ, షుగర్‌ని వాకింగ్‌తో కంట్రోల్ చేయొచ్చా.?

వాకింగ్ వల్ల బరువు తగ్గుతామన్న సంగతి తెలిసిందే. పైకి కనిపించేంతలా బరువు తగ్గకపోయినా, శరీరం లైట్ వెయిట్ అయ్యి ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తుంది. వాకింగ్‌తో కేవలం ఇదొక్కటే ప్రయోజనమా.? అంటే కాదండీ. బీపీ, షుగర్ కూడా కంట్రోల్‌లో వుంటాయ్.

వాకింగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ అయ్యి వేస్ట్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే, రక్తపోటు నియంత్రణలో వుంటుంది. వాకింగ్‌లో రెండు రకాలుంటాయ్. స్లోగా అడుగులో అడుగేసుకుంటూ నడవడం ఒకటైతే, స్పీడ్ వాక్ ఇంకో రకం.  

రోజులో మూడు సార్లు స్పీడ్ వాక్ చేయడం వల్ల రక్తనాళాల్లో ధృడత్వం తొలిగిపోయి రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. తద్వారా రక్తపోటు సమస్య తీరుతుంది. అలాగే, తిన్న తర్వాత కాసేపు నడిచే నడక రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో వుంచేందుకు తోడ్పడుతుంది. 

మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, భోజనం తర్వాత కనీసం 10 నుంచి 15 నిముషాలు నడిచే నడక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం అని నిపుణులు చెబుతున్నారు.
 
ఇక రెగ్యులర్‌గా చేసే వాకింగ్ కీళ్ల నొప్పుల్నీ, మోకాళ్ల నొప్పుల్నీ కంట్రోల్‌లో వుంచుతుంది. కీళ్లకు మద్దతునిచ్చే కండరాలను నడక ద్వారా బలోపేతం చేసుకోవచ్చు. తద్వారా కీళ్ల నొప్పులు తగ్గించుకోవడంలో నడక మంచి ప్రయోజనకారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com