GMR కార్గో ద్వారా పూణేకు రోడ్డు ఫీడర్ సర్వీసు
- July 21, 2023పూణే–హైదరాబాద్ మధ్య లాజిస్టిక్స్ ను మరింత సులభతరం చేసేందుకు GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో తన రోడ్డు ఫీడర్ సర్వీసును (RFS) ప్రారంభించింది. ఎనిమిదికి పైగా పారిశ్రామిక ప్రాంతాలు కలిగిన పూణే ప్రాంతానికి ఈ RFS సర్వీస్ వల్ల మేలు జరుగుతుంది. ఈ సర్విస్ ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫార్మా రంగాల వాణిజ్య వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ఆకాంక్షిస్తోంది. కార్గో టర్మినల్ , ఆన్ సైట్ రెగ్యులేటర్స్, వేర్‌హౌసింగ్ మరియు కార్గో ట్రేడ్ ఆఫీసులు ఒకే ఇంటిగ్రేటెడ్ ‘కార్గో విలేజ్’ కలిగి ఉండడం GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ప్రత్యేకత. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో సౌకర్యంలో ప్రధాన ఆకర్షణ ప్రత్యేకమైన 'ఫార్మా జోన్'. జిహెచ్ఎసి యొక్క మల్టీ-యుఎల్డీ (ULD) కూల్ డాలీ -20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత-సున్నితమైన సరుకును నిర్వహించడానికి భారతదేశంలోనే అతిపెద్ద కేంద్రాలలో ఒకటిగా ఉంది. అంతేకాక, ఈ టెర్మినల్ కూల్ డాలీ, ఎన్విరోటైనర్ మరియు వాక్యూటెక్తో సహా ఆధునిక ఉష్ణోగ్రత నియంత్రిత కూల్ కంటేనర్లతో భారతదేశపు అతిపెద్ద ఫ్లీట్నూ అందిస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు