GMR కార్గో ద్వారా పూణేకు రోడ్డు ఫీడర్ సర్వీసు
- July 21, 2023
పూణే–హైదరాబాద్ మధ్య లాజిస్టిక్స్ ను మరింత సులభతరం చేసేందుకు GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో తన రోడ్డు ఫీడర్ సర్వీసును (RFS) ప్రారంభించింది. ఎనిమిదికి పైగా పారిశ్రామిక ప్రాంతాలు కలిగిన పూణే ప్రాంతానికి ఈ RFS సర్వీస్ వల్ల మేలు జరుగుతుంది. ఈ సర్విస్ ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫార్మా రంగాల వాణిజ్య వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ఆకాంక్షిస్తోంది. కార్గో టర్మినల్ , ఆన్ సైట్ రెగ్యులేటర్స్, వేర్హౌసింగ్ మరియు కార్గో ట్రేడ్ ఆఫీసులు ఒకే ఇంటిగ్రేటెడ్ ‘కార్గో విలేజ్’ కలిగి ఉండడం GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో ప్రత్యేకత. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో సౌకర్యంలో ప్రధాన ఆకర్షణ ప్రత్యేకమైన 'ఫార్మా జోన్'. జిహెచ్ఎసి యొక్క మల్టీ-యుఎల్డీ (ULD) కూల్ డాలీ -20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత-సున్నితమైన సరుకును నిర్వహించడానికి భారతదేశంలోనే అతిపెద్ద కేంద్రాలలో ఒకటిగా ఉంది. అంతేకాక, ఈ టెర్మినల్ కూల్ డాలీ, ఎన్విరోటైనర్ మరియు వాక్యూటెక్తో సహా ఆధునిక ఉష్ణోగ్రత నియంత్రిత కూల్ కంటేనర్లతో భారతదేశపు అతిపెద్ద ఫ్లీట్నూ అందిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







