మూడు స్మగ్లింగ్ యత్నాలను అడ్డుకున్న ZATCA
- July 23, 2023
రియాద్: 539,000 కంటే ఎక్కువ క్యాప్‌గాన్ మాత్రలను రాజ్యంలోకి అక్రమంగా తరలించడానికి మూడు వేర్వేరు ప్రయత్నాలను అడ్డుకుంది జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA). జోర్డాన్ సరిహద్దులోని హదితా డ్రై పోర్ట్ ద్వారా వచ్చిన మూడు వాహనాల్లో మాత్రలు దాచి ఉంచారు. మొదటి ప్రయత్నంలో.. నిందితులు వాహనంలోని పలు భాగాలలో దాచిపెట్టిన 187,200 క్యాప్టాగన్ మాత్రలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారని ZATCA పేర్కొంది. రెండవ కేసులో.. ట్రైలర్ ట్రక్కు రేడియేటర్‌లో వాటిని దాచిపెట్టి, 210,400 క్యాప్‌టాగన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు విఫలం చేశారు. మూడో ప్రయత్నంలో.. ఒక వాహనం టైర్లలో 1,42,200 క్యాప్టాగన్ మాత్రలు దాచి ఉంచారు. అన్ని కస్టమ్స్ అవుట్‌లెట్‌ల ద్వారా దిగుమతులు, ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను కఠినతరం చేయడాన్ని కొనసాగిస్తామని , అన్ని నేరపూరిత చర్యల నుండి సమాజానికి భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి ఏదైనా స్మగ్లింగ్ ప్రయత్నాలను ఎదుర్కొంటామని అథారిటీ స్పష్టం చేసింది. స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ (1910) లేదా (ఇ-మెయిల్: [email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలిపి సహకరించాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







