కువైట్ లో ఆగస్టు 10, 11 తేదీలలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రదర్శన
- July 23, 2023
కువైట్: ఇండియాలో జరుగనున్న ప్రపంచ కప్ ట్రోఫీని ఆగస్టు 10, 11 తేదీల్లో కువైట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC ) ప్రదర్శించనున్నది. CWC ట్రోఫీ పర్యటన సందర్భంగా కువైట్కు ICC ప్రపంచ కప్ ట్రోఫీ రావడం ఇదే తొలిసారి. కువైట్ క్రికెట్ అభిమానులు, అనుచరులు, జట్లు, ఆటగాళ్లు, సభ్యులు, అధికారులు, స్పాన్సర్లు, మీడియా ఛానెల్లు మరియు భాగస్వాములు అందరూ ఆగస్టు 11న కువైట్లోని సులైబియా క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ప్రపంచ కప్లో అతిపెద్ద బహుమతితో సెల్ఫీ, ఫోటో తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు కువైట్ క్రికెట్ అధికారులు తెలిపారు.
ప్రపంచ కప్ ప్రదర్శన కార్యక్రమం జూన్ 27న భారతదేశంలో ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 4న తిరిగి ఆతిథ్య దేశమైన భారత్ కు తిరిగి చేరుకుంటుంది. కువైట్, బహ్రెయిన్, మలేషియా, USA, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఆతిథ్య దేశం భారతదేశంతో సహా ప్రపంచంలోని 18 దేశాలలో ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించనున్నట్లు ICC చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ వెల్లడించారు. 2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ భారతదేశంలో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరుగనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







