బహిరంగ కేకలకే అమెరికా మహిళను అరెస్ట్ చేయలేదు:దుబాయ్ పోలీసులు
- July 23, 2023
యూఏఈ: కేవలం బహిరంగంగా కేకలు వేసినందుకే అమెరికా మహిళను అరెస్టు చేశారన్న ఆరోపణలను దుబాయ్ పోలీసులు ఖండించారు. మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని కథనాలలో ప్రస్తావించబడిన వాదనలు కేసును పూర్తిగా వక్రీకరించిన విధంగా ఉన్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం "అరుపు" మాత్రమే కాదని, కారు అద్దె కార్యాలయం నుండి ఫిర్యాదు అందిందని దుబాయ్ పోలీసులు చెప్పారు. "కారు అద్దె రుసుము విషయంలో వివాదం జరుగగా.. ఉద్యోగిని అసభ్య పదజాలంతో అవమానించడంతో సదరు అమెరికా మహిళపై కేసు నమోదు అయిందని వివరించారు. యూఏఈలో పరువు నష్టం అనేది భారీ జరిమానాలు, జైలు శిక్ష విధించదగిన తీవ్రమైన నేరం. చట్టం ప్రకారం ఇతరులను ధిక్కరించేలా మరొక వ్యక్తికి బహిరంగంగా అవమానించడం చేస్తే ఒకరికి 20,000 దిర్హామ్ల జరిమానా మరియు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. సదరుఅమెరికా మహిళను చట్టపరమైన విధానాల ప్రకారం ప్రశ్నించడం జరిగిందని, కొనసాగుతున్న చట్టపరమైన చర్యల పరిష్కారం పెండింగ్లో ఉందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









