యూఏఈలో ఉండే తండ్రి తన కుమార్తెను స్పాన్సర్ చేయవచ్చా?
- July 23, 2023
యూఏఈ: ఆర్థిక సమస్యల కారణంగా యూఏఈలో నివాసం ఉండే వ్యక్తి.. తన మొత్తం కుటుంబాన్ని స్పాన్సర్ చేయలేరు. అయితే, వారి కుమార్తె మాత్రమే తమతోపాటు ఉండి చదువుకోవడానికి మాత్రమే స్పాన్సర్ చేయడానికి అనుమతి ఉందా? అనే సందేహాం కొందరిలో ఉంటుంది. అయితే, UAE నివాసి అయిన వారందరూ వారి సంతానానికి రెసిడెన్సీని స్పాన్సర్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. విదేశీయుల ప్రవేశం, నివాసానికి సంబంధించి 2021 ఫెడరల్ డిక్రీ లా నంబర్ 29 యొక్క నిబంధనలు వారికి వర్తిస్తాయి. యూఏఈలో నివాసి అయిన వ్యక్తి తన కుటుంబ సభ్యులకు రెసిడెన్సీ వీసా కోసం స్పాన్సర్ చేయవచ్చు. ఇది యూఏఈ ఇమ్మిగ్రేషన్ చట్టంలోని ఆర్టికల్ 9కి అనుగుణంగా ఈ అవకాశం ఉంది. అంతేకాకుండా, యూఏఈలో నివాసం లేకుండా నెలవారీ జీతం 4,000 లేదా యూఏఈలో వసతితో పాటు Dh3,000 సంపాదించే నివాసి తన పెళ్లికాని కుమార్తెను స్పాన్సర్ చేయవచ్చు. యూఏఈలోని విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుండి అడ్మిషన్ లెటర్‌ను పొందేందుకు సంబంధిత ఛానెల్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన తర్వాత సంబంధిత విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం ఆమెకు యూఏఈ నివాస వీసాను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) - దుబాయ్ లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, పౌరసత్వం, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ నుండి పొందేందుకు అవకాశం ఉంది. అలాగే విద్యార్థి కేటగిరీ కింద గోల్డెన్ వీసాకు అర్హత ఉంటే, వారు గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయంపై మరింత సమాచారం కోసంGDRFAని సంప్రదించాలని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వివరించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







