నెట్‌ఫ్లిక్స్ కి షాకిస్తున్న సబ్ స్కైబర్స్..!
- July 24, 2023
యూఏఈ: పాస్‌వర్డ్ షేరింగ్ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చిన నెట్ ఫ్లిక్స్ కి సబ్ స్కైబర్స్ షాకిస్తున్నారు. కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లడం, ప్లాన్‌లను డౌన్‌గ్రేడ్ చేయడం గురించి నెట్ ఫ్లిక్స్ కస్టమర్లు ఆలోచిస్తున్నారు. అనేక మంది యూఏఈ నివాసితులు వారి ప్రాథమిక పరికరాలలో నిర్ధారణ కోసం నోటిఫికేషన్‌లను అందుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ని ఇకపై కొనసాగించకూడదని, కొత్త సబ్‌స్క్రిప్షన్‌ని పొందే విషయాన్ని ఆలోచన చేస్తున్నట్లు కొందరు నెట్ ఫ్లిక్స్ కస్టమర్లు వెల్లడించారు. మరికొందరు Netflix కొత్త ఆప్షన్ల ఎంపికను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ ఖాతాకు నెలకు $7.99 చొప్పున అదనపు సభ్యుడిని జోడించుకునే ఎంపికను అందిస్తుంది. అయితే, స్ట్రీమింగ్ సర్వీస్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ సేవ ప్రస్తుతం UAEలో అందుబాటులో లేదు.
దుబాయ్ నివాసి, ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అయిన అరీబ్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. తనకు నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఉంది. దానిని నేను నా కుటుంబంతో పంచుకుంటాను. కొన్నిసార్లు విమానంలో లేదా విదేశాలలో నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. నేను లాగిన్ అయినప్పుడు ఇంటిలో ఉన్న నా కుటుంబం Netflixని చూడలేరని దీని అర్థమా? కెనడాలో తన కుటుంబం, పిల్లలతో సంవత్సరంలో కనీసం పావు వంతు గడిపే నా భార్య, అక్కడ మా ఖాతాను కూడా ఉపయోగిస్తుందన్నారు. ఖాతాను డౌన్‌గ్రేడ్ చేస్తానని, ఇకపై ఒకే IP చిరునామాలో ఉండవలసి వచ్చినట్లయితే, దానిని వేర్వేరు పరికరాలలో కలిగి ఉండటం వలన ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫారమ్‌లోని వైఫై నెట్‌వర్క్, పరికరాల IP చిరునామాను గుర్తించడం ద్వారా పాస్‌వర్డ్ షేరింగ్‌ను గుర్తించి పరిమితం చేయనున్నట్లు ఇంతకుముందు వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







