అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి సిఎం జగన్ శంకుస్థాపన
- July 24, 2023
అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సోమవారం తాడేపల్లి నుండి గుంటూరు జిల్లా పర్యటనకు సిఎం వైఎస్.జగన్ బయలుదేరారు. కృష్ణాయపాలెంకు చేరుకొని లేఅవుట్‌లోని పైలాన్‌ను ఆవిష్కరించారు. వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి మొక్కలను నాటారు. అనంతరం పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆర్కే, ఎంపి నందిగం సురేశ్, ఎంపి సత్యవతి, ఆదిమూలపు సురేష్ ప్రసంగించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను సిఎం జగన్ అందజేశారు. మోడల్ హౌజ్‌ను పరిశీలించారు. ఆ తరువాత కఅష్ణాయపాలెం నుంచి వెంకటపాలెంకు ముఖ్యమంత్రి బయలుదేరారు. అక్కడి బహిరంగ సభలో సిఎం జగన్ ప్రసంగించిన అనంతరం లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పట్టాలను అందజేయనున్నారు.
తాజా వార్తలు
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!









