‘ఎక్స్‌ట్రా’ చేస్తానంటోన్న నితిన్.!
- July 24, 2023
‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చవి చూసిన నితిన్, ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే.
వక్కంతం వంశీ డైరెక్షన్‌లో నితిన్ తన 32వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘ఎక్స్‌ట్రా’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. ‘ఆర్డినరీ మేన్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అలాగే, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
కంప్లీట్ మాస్ అండ్ రగ్గ్‌డ్ లుక్స్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో కనిపిస్తున్నాడు ఈ ఫస్ట్ లుక్‌లో నితిన్. లుక్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ అయితే, వస్తోంది. రిలీజ్ చేసిన పోస్టర్‌లోనే సినిమా థీమ్ కూడా రివీల్ చేశారు. సినీ ఇండస్ర్టీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని డిశంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో ‘ఎక్స్‌ట్రా’ రూపొందుతోంది. కాగా, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత వక్కంతం వంశీ నుంచి వస్తున్న సినిమా ఇది. కథలో ఖచ్చితంగా పట్టుండబోతోందని అయితే తెలుస్తోంది.
మరి, నితిన్‌కి కలిసొస్తుందా.? లేదా.? చూడాలిక.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







