వృద్ధుల్లో నిద్రలేమి సమస్యా.?

- July 24, 2023 , by Maagulf
వృద్ధుల్లో నిద్రలేమి సమస్యా.?

వయసు మీద పడిన వారిలో ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వాస్తవానికి వయసు మీద పడ్డాకా 7 నుంచి 9 గంటల వరకూ నిద్ర ఖచ్చితంగా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. 

అయితే, నిద్ర సరిగ్గా పట్టాలంటే అందుకు తగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలలో నిద్రలేమిని తగ్గించే పోషకాలు వుంటాయ్. ఇవి నిద్రను ప్రేరేపించే హార్మోన్లను ఉత్తేజ పరచడంలో తోడ్పడతాయ్. 

అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వుండే ఆహారం అధికంగా తీసుకోవాలి ఓ వయసుకొచ్చాకా. అయితే, అవి ఏ ఆహారంలో ఎక్కువగా లభిస్తాయ్.? చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్ధాల్లో ఎక్కువగా ఈ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయ్. వారంలో కనీసం రెండు సార్లయినా ఈ పదార్ధాలను తమ ఆహారంలో వుండేలా చూసుకోవాలి. 

శాఖాహారులైతే, పప్పులూ, వాల్ నట్స్‌తో పాటూ, పాలు, పాల సంబంధిత పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పదార్ధాలు నిద్ర పట్టడానికి తోడ్పడే మెలటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడడంతో పాటూ, వయసు మీద పడిన వారు (వృద్ధులు) రోజంతా ఉత్సాహంగా వుండేందుకూ తోడ్పడతాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com