`జవాన్`లో `డీలర్ ఆఫ్ డెత్`గా విజయ్ సేతుపతి..పోస్టర్ రిలీజ్
- July 24, 2023
హైదరాబాద్: కింగ్ ఖాన్ షారూఖ్ తాజా భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ `జవాన్`పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తోన్న విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ పోస్టర్‌ను `డీలర్ ఆఫ్ డెత్` అంటూ షారూఖ్ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. దీంతో ఇద్దరు పవర్ హౌసెస్లాంటి యాక్టర్స్ జవాన్ సినిమాలో ఢీ అంటే ఢీ అనేలా నటించబోతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చింది.
రీసెంట్గా విడుదలైన `జవాన్ ప్రివ్యూ` యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా నెక్ట్స్ రేంజ్లో ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. అందులో విజయ్ సేతుపతి కొన్ని క్షణాల పాటు అలా మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో షారూఖ్, విజయ్ సేతుపతి మధ్య పోటీ ఎలా ఉంటుందనే ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఈ ఎగ్జయిట్మెంట్ సిల్వర్ స్క్రీన్‌పై ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చునేలా చేస్తుందనటంలో సందేహం లేదు.
విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలెంటెడ్ యాక్టర్‌గా తనెలాంటి ప్రభావాన్ని చూపిస్తారనేది అందరికీ తెలిసిందే. అలాంటి విలక్షణ నటుడు `జవాన్` సినిమాలో నటిస్తున్నారనగానే తన పాత్ర ఎలా ఉంటుందోననే ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ అంచనాలను పెంచుతూ `డీలర్ ఆఫ్ డెత్` అంటూ ఇప్పుడు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. విజయ్ సేతుపతి థియేటర్స్‌లో చూస్తే వెన్నులో వణుకు పుట్టటం ఖాయం అనిపించేలా ఉందీ పోస్టర్.
`జవాన్` సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది. షారూఖ్ ఖాన్ గుండుతో ఉన్న లుక్, నయనతార టెరిఫిక్ యాక్షన్ అవతార్ .. వీటన్నింటితోపాటు తాజాగా విడుదల చేసిన విజయ్ సేతుపతి లుక్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో.. అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌవర్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.
తాజా వార్తలు
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ









