పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్
- July 24, 2023
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయవాడ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. పవన్ ఫై ఓ మహిళా వాలంటీర్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. పవన్ వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధించారంటూ విజయవాడ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఓ మహిళా వాలంటీర్ మాట్లాడుతూ.. తన లాయర్ ద్వారా పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. వాలంటీర్లుగా మహిళల డేటాను సేకరిస్తున్నారని, డేటాను దొంగిలించారని పవన్ అవాస్తవాలు ఆరోపించారని.., ఇది తన మనోభావాలను దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.
మహిళల అక్రమ రవాణాపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. సేవ చేస్తూ వలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్‌ను చట్ట ప్రకారం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఒకే ఒక్క పిటిషన్ వేశానని, మరికొందరు తనను చూసిన తర్వాత వస్తారని తెలిపింది. సెక్షన్ 499, 00, 504, 505 కింద పవన్ పై కేసు పెట్టారు… బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత పవన్‌కు కోర్టు నోటీసులు జారీ చేస్తుందని, ఆ తర్వాత కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







