తెలంగాణలో భారీ వర్షాలు...
- July 24, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వర్ష సూచన చేసింది. తెలంగాణలో రేపటి నుంచి వానలు మళ్లీ దంచికొట్టనున్నాయి. నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేటకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 25, 26, 27 తేదీలలో అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







