కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ పోటీ..!!
- July 25, 2023
ప్రముఖ నటుడు, MNM పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. తమిళనాడులోని DMK పార్టీతో కమల్ పార్టీలో పెత్తు పెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీ చేసిన కమల్ కేవలం 1,728 స్వల్ప ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. సెంటిమింట్ కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఆ స్థానం నుంచి పోటీ చేయించడానికి DMK ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏ పార్టీ చేయలేదు. కోయంబత్తూరు జిల్లాకి చెందిన పార్టీ నేతలు కూడా కమల్ హాసన్‌ని ఈ విషయంపై అడిగారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వడానికి ఆదివారం కమల్ హాసన్ మక్కలోడు మైమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నేతలు వీధి, వీధినా తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే ఇతర పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల దృష్టికి రాని సమస్యలపై దృష్టి పెడుతూ ప్రజల నుంచి స్పందన కోరనున్నారు. క్షేత్రస్థాయిలో తిరిగే కార్యకర్తలకు 25 ప్రశ్నలతో కూడిన గూగుల్ ఫాంలు అందించి, వాటి ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, నియోజకవర్గాల వారీగా ఆ అంశాలపై గళమెత్తనున్నారు.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









