షార్జాలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి రద్దు
- July 25, 2023
షార్జా: ప్రభుత్వ రంగంలో ఉద్యోగానికి ఇకపై వయస్సు నిబంధన ఉండదని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ప్రకటించారు. సామాజిక భద్రతా నిధి చట్టం ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారు, 60 ఏళ్లలోపు వారు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేయవచ్చు అని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు ఇకపై ఏ ఇతర వయస్సు పరిమితులు వర్తించవని స్పష్టం చేశారు. షార్జా సిటీ ఫర్ హ్యుమానిటేరియన్ సర్వీసెస్, షార్జా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, యూనివర్శిటీ ఆఫ్ షార్జా సహకారంతో 45 మంది యువకులు, మహిళలకు కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వారందరూ బ్యాచిలర్, హైస్కూల్ మరియు అంతకంటే తక్కువ సెకండరీ డిగ్రీలు కలిగి ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







