డైలమాలో నాగ్.! ఏదీ కలిసి రావడం లేదా.?
- July 26, 2023
అగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లు తమ తమ కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. కానీ, నాగార్జున మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే వున్నారు. కొత్త దర్శకుడు బెజవాడ ప్రసన్న కుమార్‌తో నాగార్జున ఓ సినిమా చేయాల్సి వుంది.
కానీ, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదింతవరకూ. అయితే, ఈ ప్రాజెక్ట్ నాగ్ చేయి జారిపోయిందన్న ప్రచారం కూడా జోరందుకుంటోంది ఇంకో వైపు. ఇదిలా వుంటే, నాగార్జున మరే కొత్త ప్రాజెక్టు పైనా సైన్ చేయలేదింత వరకూ. మరోవైపు అక్కినేని కుటుంబం నుంచి వారసులు చైతన్య, అఖిల్ కెరీర్ కూడా డల్‌గానే నడుస్తోంది.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. ఈ లోపు బిగ్‌బాస్ ఏడో సీజన్ అలికిడి మొదలైంది. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ కోసం నాగార్జున సిద్ధమవుతున్నారు.
అయితే, బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ వద్దంటే వద్దు.. అంటూ ఇంకో వైపు నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య నాగార్జున తన కెరీర్‌ని ఎలా నిలబెట్టుకుంటారో.! కొడుకుల కెరీర్‌ని ఎలా డిజైన్ చేస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







